Site icon Prime9

Telangana: తెలంగాణా పేరుతో కేసిఆర్ ఆర్ధికంగా ఎదిగాడు..రేవంత్ రెడ్డి

KCR grew economically in the name of Telangana

KCR grew economically in the name of Telangana

Revanth Reddy: తెలంగాణ ప్రజల ఆకాంక్షను సీఎం కేసిఆర్ చంపేశారని, తెలంగాణ పేరుతో ఆర్ధిక బలవంతుడుగా మారాడని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా, ప్రజల్ని మభ్యపెట్టడానికే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. మీడియాతో ఆయన పలు అంశాలను తెలిపారు.

కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే కేసిఆర్ జాతీయ పార్టీ స్థాపించారన్నారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, దాన్ని చంపేయాలనుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తెలంగాణ బిడ్డగా కేసిఆర్ దుర్మార్గపు ఆలోచనలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. తెలంగాణాలో పోటీ చేయడానికి కేసిఆర్ కు అర్హత లేదని చెప్పారు. కేసిఆర్ వికృత ఆలోచనలపై తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.

రానున్న 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మద్య ఉన్న విభజన సమస్యలు తామే పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: TRS now BRS: తెరాస..అయిందిక… భారత రాష్ట్ర సమితి

Exit mobile version