Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస పరీక్షకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్‌లోని యుపిఎ ఎమ్మెల్యేలు రాయ్‌పూర్ రిసార్ట్‌లో బస చేసిన ఒక రోజు తర్వాత ఆదివారం రాంచీకి తిరిగి వెళ్లారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష బిజెపి తన ఎమ్మెల్యేలను వేటాడుతుందనే భయంతో, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ యొక్క జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేతృత్వంలోని కూటమి శాసనసభ్యులను నవ రాయ్‌పూర్‌లోని విలాసవంతమైన రిసార్ట్‌కు తరలించింది. తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలతో హేమంత్ సోరెన్ నిన్న సమావేశమయ్యారు.
మరోవైపు ప్రతిపక్ష బీజేపీ కూడా సభలో తన వ్యూహాన్ని రూపొందించడానికి ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం మాట్లాడుతూ, “జార్ఖండ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. మా ప్రతినిధి బృందం గవర్నర్‌ను (గురువారం) కలిసింది మరియు ఒకటి లేదా రెండు రోజుల్లో పరిస్దితిని క్లియర్ చేస్తామని ఆయన మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. అందుకే అసెంబ్లీలో మా అంశాలను లేవనెత్తి మెజారిటీని నిరూపించుకుంటామని అన్నారు.
రాయ్‌పూర్‌కు వెళ్లిన వారిలో నలుగురు మంత్రులు, జేఎంఎంకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్‌కు చెందిన 13 మంది ఉన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార కూటమి సిద్ధంగా ఉందని సోరెన్ రాంచీ విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు.