Visakhapatnam: ఏపీలో భాజపాకు తోడుగా ఉండేది జనసేనేనని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం జాప్యానికి అధికార వైకాపా, గత టీడీపీ ప్రభుత్వాలే కారణమంటూ కొత్తగా ఆరోపించారు. కేంద్రానికి అన్ని చెప్పే చేస్తున్నామని ఒకరు, తమతో భాజాపా వస్తుందని ఇంకొకరు చెప్పుకొంటున్నారని మాధవ్ పేర్కొన్నారు.
ఏపీకి రైల్వే జోన్ రాదని మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. విభజన హామీల్లో లేని వాటికి కూడ కేంద్రం ఏపీకి కేటాయించిందన్నారు. 2019లోనే కొత్త రైల్వే జోన్ ను ప్రకటించామని చెప్పారు. త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా శంఖుస్థాపన ఉంటుందని వ్యాఖ్యానించారు. గత బడ్జెట్ లో రైల్వే జోన్ కు నిధులు కూడా మంజూరు చేసిన్నట్లు ఆయన తెలిపారు.
విభజన అంశాల పై రెండు రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపుల సమయంలో రైల్వే జోన్ హుళక్కే నంటూ ప్రధానంగా శీర్షికలు వెలువడ్డాయి. దీంతో కంగారు పడ్డ భాజాపా రాష్ట్ర నేతలు రైల్వే జోన్ అంశం పై కేంద్రం చిత్తశుధ్దిగానే ఉందని చెప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. భాజాపా పాలిత రాష్ట్రాలకు అందిస్తున్న నిదుల చేయూతతో పోలిస్తే దక్షిణాధి రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా మంజూరు చేయడం లేదనేది జగమెరిగిన సత్యం.
జీఎస్టీ వసూళ్లలో దక్షిణాధి రాష్ట్రాలు చాలా వరకు ముందంజలో ఉన్నాయి. అయినా నిధుల కేటాయింపులో కేంద్ర వివక్షతను చూపిస్తుందనే పదే పదే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. జనభా ప్రాతిపదికన ఏమేరకు నిధులు రాష్ట్రాలకు కేటాయించామో అన్న దానిపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలి. వాస్తవాలు ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గ్రహించాలి.
ఇది కూడా చదవండి: వైకాపా నేతలు.. మూసుకొని కూర్చోండి.. పాదయాత్ర మహిళలు