Site icon Prime9

Janasena Counter attack: సీఎం జగన్ పై జనసేన నేత మహేష్ తీవ్ర వ్యాఖ్యలు

Janasena leader Mahesh's harsh comments on CM Jagan

Janasena leader Mahesh's harsh comments on CM Jagan

Vijayawada: సీఎంను అర్జంటుగా ఈఎన్టీ స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జగన్ విమర్శలు చేసిన క్రమంలో ఆ పార్టీ శ్రేణులో రగిలిపోతున్నారు. జగన్మోహన రెడ్డి అవనిగడ్డలో ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడరని మండిపడ్డారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే హైదరాబాదుకు జగన్ ను తీసుకెళ్లాలని మహేష్ సూచించారు. ఒక భూత వైద్యుడు వేద మంత్రాలు చదవిన్నట్లుందని, హత్య చేసి, ఆ వ్యక్తి ఎదుటే పూజ చేసిన్నట్లు జగన్ తీరు ఉందని విమర్శించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు అన్న విధంగా జగన్ వ్యవహార శైలి కనిపిస్తుందని మహేష్ పేర్కొన్నారు. పవన్ హెచ్చరించిన్నప్పటికీ వైకాపా నేతల నోర్లను ఎందుకు జగన్ అదుపులో పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

అవనిగడ్డ పొలాల్లో పాములు వచ్చేవని, నేడు జగన్ అనే కట్ల పాము వచ్చి పవన్ పై విషం చిమ్మిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ లో పవన్ కల్యాణ్ ను ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలు గమనించారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు, సోమువీర్రాజులు పవన్ కల్యాణ్ ను కలిశారని, దీంతో జగన్ కు భయం పట్టుకొనిందని, ఆయన మాటలతో అర్ధమౌతుందని మహేష్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: CM Jagan: పవన్ పై సీఎం జగన్ కౌంటర్ ఎటాక్.. వీధి రౌడీలు కూడా అలా మాట్లాడరంటూ ఫైర్

Exit mobile version