Site icon Prime9

MLA Jaggareddy: లిమిట్స్ దాటొద్దు.. షర్మిలకు జగ్గారెడ్డి వార్నింగ్

jaggareddy

jaggareddy

Hyderabad: షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. నన్ను వ్యభిచారి అంటావా? అంటూ అంటూ షర్మిల పై మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను వ్యభిచారి అంటే ఏమీ కాదని, కానీ అదే మాట తానంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్‌ లో ఉన్నప్పుడే పులిని అని పేర్కొన్నారు.

వైఎస్‌తో ఉన్నప్పుడు పులి, ఇప్పుడు పిల్లిలా ఉన్నా అనే షర్మిల మాట అబద్ధమన్నారు. తాను టీఆర్ఎస్‌లో ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో తనను కట్టడి చేయడానికి పోలీసులను ఉపయోగించారన్నారు. తన స్టైల్ నచ్చి వైఎస్ పిలిచారని అభివృద్ధి కోసం ఆనాడు వెళ్ళానన్నారు. మీ ఇంటి పంచాయతీని మా మీద రుద్దకండి. ఏపీకి మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి. మూడు రాష్ట్రాలకు మీ ముగ్గురు సీఎంలు కండి. మీకు ముఖ్యమంత్రి పదవుల కోసం రెండు రాష్ట్రాలను నాశనం చేస్తారా? వైయస్ బిడ్డ అని మిమ్మల్ని ఎవరు తిట్టలేక పోతున్నారు. షర్మిల పక్కా బీజేపీ ఏజెంట్, బీజేపీ బినామీ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవడంతో పేదలు ట్రీట్‌మెంట్ చేయించుకోలేని పరిస్థితి ఉందన్నారు. పేదలు అనారోగ్యంతో హాస్పిటల్‌కు వెళ్లి అప్పుల పాలు అవుతున్నారన్నారు. సీఎం కేసిఆర్ ఆరోగ్య శ్రీని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎంలను ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా గతంలో కలిసే సంప్రదాయం ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.

Exit mobile version