Prime9

Vangalapudi Anitha: జగన్ నటించడంలో ఎస్వీఆర్ ను మించిపోయాడు

Andhra Pradesh: సీఎం జగన్మోహన్ రెడ్డి నటనలో ఎస్వీ రంగారావును మించిపోయాడని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా విమర్శించారు. అనిత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మీడియా ముందుంచారు. ఏదైనా విషయం ఉంటే దాని దృష్టి నుండి మరల్చడంలో వైకాపా దొంగల ముఠా రెడీగా ఉంటుందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి అల్లుడు పేర్లు ఉన్నట్లు ప్రచారం సాగుతోందన్నారు. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఎన్టీఆర్ పేరు మార్పు చేసారని ఆమె మండిపడ్డారు.

జగన్ కు ఉన్న తాడేపల్లి ప్యాలస్, హైదరాబాదు లోటస్ పాండ్ లకు వైఎస్ పేరు ఎందుకు పెట్టలేదని ఎద్దేవా చేశారు. వైద్య రంగంలో వైఎస్ఆర్ చేసిన సేవను చెబుతున్న జగన్, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఎన్టీఆర్ కు, మీ నాన్నకు ఉందని గుర్తించాలని అనిత వ్యాఖ్యానించారు. తల్లి, చెల్లిని పొరుగు రాష్ట్రానికి పంపిన జగన్ కు వారిద్దరి పై ఎందుకు ప్రేమ లేదని ఎత్తిచూపారు. 16నెలలు జైల్లో ఉన్న అనుభవం ఉంది కాబట్టి సెంట్రల్ జైలుకు సీఎం జగన్, వైఎస్ఆర్ అని పెట్టుకోవచ్చు గదా అని ఉచిత సలహా కూడా అనిత ఇచ్చింది. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు అంటున్నారు. ఇందులో వైకాపా నేతలు తప్పితే మరొకరు ఉండరన్నారు.

ఒక్క రాజధానిని కట్టేందుకే డబ్బులు లేవంటున్న సీఎం జగన్ మూడు రాజధానుల ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కబ్జాలు తప్పితే విశాఖకు ఏంచేసారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవస్ధలంటే సీఎంకు పట్టదని వంగలపూడి అనిత మాట్లాడారు.

Exit mobile version
Skip to toolbar