Site icon Prime9

Ycp Mla Mustafa : వైకాపా ఎమ్మెల్యే ముస్తాఫా కుటుంబ సభ్యుల ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు..

it raids continues on ycp mla mustafa relatives houses

it raids continues on ycp mla mustafa relatives houses

Ycp Mla Mustafa : గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తాఫా షేక్‌ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముస్తాఫా సోదరుడు కనుమ ఇంటితో పాటు, ఆయన బంధువుల్లో కొందరి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడు  కనుమ అంజుమన్ కమిటి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ముస్తాఫా వ్యాపార లావాదేవీలు మొత్తం కనుమ చూసుకుంటారని తెలుస్తోంది. కనుమతో కలిసి ముస్తాఫా పొగాకుతో సహా పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నట్టుగా సమాచారం.

ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా నిన్న (మంగళవారం) ఉదయం నుంచే ముస్తాఫా కుటుంబ సభ్యుల ఇళ్ళల్లో ఐటీ అధికారుల సోదాలు మొదలయ్యాయి. కేంద్ర బలగాల రక్షణలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడా పలువురు పొగాకు వ్యాపారుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.  ఆయా కార్యాలయాల్లో రికార్డులను ఐటీ అధికారులు పరిశీలించారు. ఈ క్రమం లోనే ముస్తాఫా కుటుంబ సభ్యుల ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈసారి ఎమ్మెల్యే గా ముస్తాఫా కుమార్తె (Ycp Mla Mustafa)..

గుంటూరు తూర్పు నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు గెలిచిన ముస్తఫా.. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తన కుమార్తెను రంగంలో దింపేందుకు ఆలోచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. కుమార్తెను రాజకీయాల్లో దింపి.. తాను వ్యాపారం చూసుకోవాలనుకుంటున్నట్టు ఇటీవల ఎమ్మెల్యే ముస్తాఫా ఓ సమావేశంలో చెప్పారు. ఆర్ధిక సమస్యలే తన నిర్ణయానికి కారణమన్నారు ముస్తఫా.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version