Site icon Prime9

Bharat Jodo Yatra: తెలుగు రాష్ట్రాల్లో జోడో యాత్ర టీం లీడర్ నేనే

I am the Jodo Yatra team leader in Telugu states

I am the Jodo Yatra team leader in Telugu states

Vijayawada: తెలుగు రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్రను సమన్వయం చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం తనకు అప్పగించిందని ఆ పార్టీ సీనియర్, తెలంగాణ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడరు.

రాహుల్ గాంధీ తలపెట్టిన జోడోయాత్ర 13వ రోజు కేరళలో సాగుతుందన్నారు. కన్యాకుమారి నుండి పలు రాష్ట్రాల మీదుగా కాశ్మీర్ వరకు సాగే రాహుల్ పాదయత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో తాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆ విషయం గురించి ఏపీ కాంగ్రెస్ నేతలతో మాట్లాడేందుకు విజయవాడకు రావడం జరిగిందన్నారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర ఉద్ధేశం బలంగా ప్రజల్లోకి వెళ్లడం పట్ల ఓ మంచి స్పందనగా ఉత్తమ్ పేర్కొన్నారు.

ఏపీలో కూడా అందరూ కలిసి ఈ యాత్రను విజయవంతం చేసేందుకు అభ్యంతరాలు పక్కన పెట్టి పనిచేయాలని ఆయన సూచించారు. ఏదైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురండంటూ వారికి తెలిపారు.

 

 

Exit mobile version