Site icon Prime9

Sharad Pawar: కాంగ్రెస్ కు నేను వ్యతిరేకం కాదు

I am not against Congress

I am not against Congress

Maharashtra: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరదపవార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి జోడో యాత్ర ప్రయోజనంగా మారుతుందని తెలిపారు.

మహారాష్ట్రలోని షాలాపూర్ జిల్లాలో పవార్ మీడియాతో మాట్లాడారు. భారీ పాదయాత్రలు వల్ల రాజకీయ ప్రభావం తప్పక ఉంటుందన్నారు. మంచి ఉద్ధేశాలతో పాదయాత్రలు చేస్తే ప్రజలు స్వాగతిస్తారన్నారు. 1980లో జలగావ్ నుండి నాగపూర్ వరకు తాను చేసిన పాదయాత్రను పవార్ గుర్తు చేసుకొన్నారు. 5వేలతో ప్రారంభమైన పాదయాత్ర ముగిసే సమయానికి లక్షకే చేరుకోవడం అప్పట్లో ఓ ప్రభంజనంగా చెప్పుకొచ్చారు.

2024 ఎన్నికలపై పవార్ స్పందిస్తూ రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్ర ఆ పార్టీకి సైతం ప్రయోజనం కల్గిస్తుందన్నారు. విపక్ష కూటమిలో కాంగ్రెస్ ను చేర్చుకోరాదని కొన్ని పార్టీల అభిప్రాయంగా ఉందని పవర్ పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయం నాటికి ఎన్నో మార్పులు చోటుచేసుకొనే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈడీ అరెస్ట్ లపై పవార్ స్పందించారు. అనిల్ దేశ్ ముఖ్, నవాబ్ మాలిక్, సంజయ్ రౌత్ ఎవరైనా కావచ్చు అకారణంగానే వారిని జైలులో ఉంచారని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ముంబైలో దసరా ఉత్సవాలను 30ఏళ్లగా ఉద్దవ్ వర్గమే చేపడుతుందని, శివాజీ పార్కులో బాలా సాహెబ్ సమయం నుండి సంప్రదాయంగా జరుపుకొంటున్నారని అన్నారు. సీఎం ఏక్ నాధ్ షిండే నేతృత్వంలో దసరా ఉత్సవాలు చేపట్టుకోవచ్చని, అందుకు ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్ లో ర్యాలీ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వవచ్చని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

Exit mobile version