Harirama Jogaiah Comments: టీడీపీ-జనసేన పొత్తుపై చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొoడి హరిరామ జోగయ్య నేటి రాజకీయం పేరుతో బహిరంగ లేఖ రాశారు. జనసేన పార్టీకు 25 నుంచి 30 సీట్లు ఇస్తే.. సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నారని జోగయ్య అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలు లేదా తణుకు, నిడదవోలు నియోజక వర్గాలు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - January 27, 2024 / 02:56 PM IST

Harirama Jogaiah Comments: కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొoడి హరిరామ జోగయ్య నేటి రాజకీయం పేరుతో బహిరంగ లేఖ రాశారు. జనసేన పార్టీకు 25 నుంచి 30 సీట్లు ఇస్తే.. సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నారని జోగయ్య అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలు లేదా తణుకు, నిడదవోలు నియోజక వర్గాలు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జనసైనికుల్లో అసంతృప్తి ..(Harirama Jogaiah Comments)

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించడం పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అని జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు.అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్ రాజోలు రాజానగరం ప్రకటించినప్పటికీ జనసైనికులు సంతృప్తిగా లేరని అన్నారు.ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలు లేదా తణుకు, నిడదవోలు నియోజక వర్గాలు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే బాగుండేది. 2014లో జనసేన,టీడిపి, బీజేపి కూటమి పోటి చేసినా జనసేన చంద్రబాబు నాయుడు సీనియార్టీని గౌరవించే రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయలేదు.2019లో జనసేన 137 చోట్ల పోటీచేయగా 60 నియోజకవర్గాల్లో పదివేలకు పైబడి ఓట్లు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం, తక్కువ సీట్లు అంటూ ఒక వర్గం ప్రచారం చేయడంతో జనసైనికుల్లో అసంతృప్తి నెలకొందని జోగయ్య లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా జనసేనకు ఆర్థికంగా, సామాజికంగా బలంగా గెలిచే అవకాశాలు ఉన్న 50 అసెంబ్లీ నియోజకవర్గాలు ,6 పార్లమెంటు నియోజకవర్గాల పేర్లను జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు.