Nirmal: అవినీతికి కేరాఫ్ అడ్రసుగా నిలిచారంటూ సీఎం కేసిఆర్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్ష్యురాలు వైఎస్ షర్మిల మరో మారు ఆయన పాలనపై మండిపడ్డారు. 8ఏళ్లుగా కేసిఆర్ ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిందని విమర్శించారు. ఈమేరకు దిలావర్ పూర్ మండలంలో సాగుతున్న ప్రజాప్రస్ధానం పాదయాత్రలో షర్మిల్ తెరాస ప్రభుత్వంపై షర్మిల ధ్వజమెత్తారు.
పేదల సంక్షేమం కొరకు ఏ ఒక్క పధకాన్ని సక్రమంగా అమలు చేయలేదన్నారు. పధకాల పేరుతో చేయని మోసం లేదని అన్నారు. వృద్ధులకు పెన్షన్ ఇచ్చేందుకు కూడా కేసిఆర్ కు చేతులు రావడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయని భాజపా, కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. వైఎస్ఆర్ కలలు గన్న సంక్షేమ పాలన కోసమే పుట్టింది తన పార్టీ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
కొద్ది రోజుల క్రితం వైఎస్ షర్మిలపై తెరాస శ్రేణులు మాటల యుద్ధాన్ని ప్రారంభించారు. ఒక దశలో అంతు చూస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే షర్మిల ఢిల్లీ పర్యటన నుండి వచ్చిన అనంతరం ఆమెపై ఎటువంటి కామెంట్లు చేయకుండా తెరాస శ్రేణులు మౌనంగా ఉండిపోయారు.
ఇది కూడా చదవండి:Union Minister Kishan Reddy: తెరాస పార్టీ సంతలో పశువులను కొన్నట్లుగా నేతల్ని కొంటున్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి