Chandrababu: జగన్ కు ఓడిపోతామనే భయం పట్టింది అందుకే రాష్ట్రంలో తెదేపా సభలను రోడ్ షోలను అడ్డుకుంటున్నాడు. నేను సీఎంగా ఉన్నప్పుడు నేనలా అనుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చెయ్యగలిగేవాడా.. జీవో నెంబర్ 1 తీసుకురావడం ఏంటి ప్రజలను కలవడానికి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇన్ని పర్మిషన్లా.. దేశంలో ఎక్కడైనా ఇన్ని ఆంక్షలు ఉన్నాయా అంటూ చంద్రబాబు జగన్ సర్కారును ప్రశ్నించారు. సైకో పాలనలో రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంతమంది పోలీసులు సైకో జగన్ కు తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఎమర్జెన్సీని విధించేలా చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎస్పీ ఎక్కడున్నావ్.. టీడీపీ పై దాడులు చేయ్యడానికి వచ్చావా.. పోలీసులు సమాధానం చెప్పాలి. పోలీసులు వ్యవస్థ అప్రజాస్వామికంగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా బాధ్యత మరిచి వ్యవహిరించే పోలీసులు కూడా నేరస్థులే అంటూ ఆయన అన్నారు.
తనకు రక్షణ కల్పించాల్సిన డీఎస్పీ ఎక్కడన్నా రావాలి.. నా వాహనాన్ని ఎక్కడున్నా తీసుకురావాలి కోరారు. చైతన్య రథానికి అక్రమంగా తీసుకెళ్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలీసులు ముందుకు రావాలి.. ఇక్కడ కాకపోతే వేరే దగ్గర, ఈ పోస్ట్ కాకపోతే ఇంకోపోస్ట్ మీరు ప్రజలకు సేవ చేసేందుకే ఉద్యోగంలో ఉన్నారంటూ ఆయన గుర్తుచేశారు.