Site icon Prime9

Revanth Reddy: బ్యాలట్ పేపరు ముద్రణలో సీఈసీ విఫలం.. ఆరోపించిన రేవంత్ రెడ్డి

revanthreddy

revanthreddy

Munugode: మునుగోడు ఉప ఎన్నికల విషయంలో చీఫ్ ఎలక్షన్ కమీషన్ విఫలం చెందిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ పేపరు ముద్రణలో తగిన ప్రమాణాలు పాటించలేదన్నారు. బ్యాలెట్ పేపరులో పేర్లను ముద్రించే క్రమంలో జాతీయ పార్టీల అభ్యర్ధుల పేర్లు ముందు వరుసలో ఉండాలన్నారు. అయితే తెరాసా పార్టీ అభ్యర్ధి పేరును రిటర్నింగ్ అధికారి రెండో స్థానంలో ఉంచారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెరాస ఇంకా జాతీయ పార్టీగా మారలేదని గుర్తు చేశారు. అభ్యర్థి కూడా తెరాస తరపునే నామినేషన్ వేసిన విషయాన్ని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు సీఎం కేసిఆర్ కు వర్తించవా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జరిగిన తప్పును గుర్తించి ఇకనైనా బ్యాలెట్ పేపరు మార్పు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:Bandi Sanjay: కేసిఆర్.. దమ్ముంటే పార్టీలో చేర్చుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు..

Exit mobile version