Priyanka Gandhi: హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వేడి ఊపందుకొనింది. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సోలన్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్నా ర్యాలీలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా భాజపా పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసం సోలన్‌కు వచ్చిన ప్రియాంకాగాంధీ తొలుత మా షూలినీ ఆలయ సందర్శన అనంతరం సభకు హాజరయ్యారు.
భాజపాను నమ్ముకొంటే ప్రజలను నట్టేట ముంచిందని ఆరోపించారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చేందుకు కేంద్రం వద్ద డబ్బులు లేవన్నారు. కానీ తనకు అనుకూలరైన బడా వ్యాపార వేత్తలకు కోట్లల్లో రుణ మాఫీ చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్నప్తి చేశారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రియాంక హిమాచల ప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు.మొదటిది లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కాగా, రెండోది పాత పెన్షన్ స్కీమ్ అమలు అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:Election Commission: నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు..ఈసీ