Bandi sanjay son: తోటి విద్యార్ధిపై బండి సంజయ్ కుమారుడు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేరకు బండి సంజయ్ కుమారుడిపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్బు ల్లాపూర్ లోని మహేంద్ర వర్సిటీలో బీటెక్ చదువుతున్న సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో దూషించాడు. విద్యార్ధిపై దాడి చేస్తూ.. చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినా వీడియో వైరల్ గా మారింది. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గాయపడిన విద్యార్ధి ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు.
బండి సంజయ్ కుమారుడు స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని అందుకే తనపై దాడి చేయి చేసుకున్నాడని ఆ విద్యార్ధి తెలిపాడు.
ఆ గొడవ తర్వాత తాము స్నేహితులుగానే ఉన్నామని తెలిపాడు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరిగింది.
చట్టాన్ని అలా చేతులోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక భాజపా కార్యకర్తలు ఈ దాడిని సమర్ధిస్తున్నారు.
ఆడపిల్ల విషయంలో బండి సంజయ్ కుమారుడు సరైన పని చేశాడని అంటున్నారు.
ఇక ఈ ఘటనపై స్పందించిన బండి సంజయ్.. తెరాసపై పలు విమర్శలు చేశారు.
కావాలనే పిల్లలతో రాజకీయం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కాలేజీలో పిల్లలు కొట్టుకుంటారు.. కలుస్తారని అలాంటి వాటిని రాజకీయం చెయవద్దని తెలిపారు.
కాలేజీలో చదివే పిల్లల జీవితాలను కేసీఆర్ నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కు దమ్ముంటే తనతో రాజకీయాలం చేయాలి గానీ.. పిల్లల విషయం ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు.
ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారని బండి ఆరోపించారు.
నిజాం అంత్యక్రియల దృష్టిని మళ్లించేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
కావాలనే ఈ కేసులో తన కొడుకుని ఇరికిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. నా కొడుకును పోలీస్ స్టేషన్‌లో నేనే సరెండర్ చేస్తా.. లాఠీలతో కొట్టిస్తవా అని మండిపడ్డారు.
నిజాం మనవడికి తెలంగాణకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. అత్యున్నత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/