Site icon Prime9

Bandi Sanjay: ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ డోసేజీని కంట్రోల్లో పెట్టాలి.. కేటీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు

Bandi sanjay

Bandi sanjay

Hyderabad:  తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజ‌లు చేయిస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను ఒక్కసారిగా వేడెక్కించాయి. బండి సంజ‌య్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ లవంగాన్ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చండి బీజేపీ బాబులూ, ఎవరినైనా కరుస్తాడేమో అంటూ ట్వీట్ చేసారు. కేటీఆర్ వ్యాఖ్యల‌ పై బండి సంజ‌య్ మ‌రింత ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు రెండు వ‌రుస ట్వీట్ల‌ను సంజ‌య్ పోస్ట్ చేశారు.

కేటీఆర్‌ను ట్విట్టర్ టిల్లుగా అభివ‌ర్ణించిన సంజ‌య్‌, ఆయ‌న డ్రగ్స్ డోసేజీని కంట్రోల్లో పెట్టాలంటూ టీఆర్ఎస్ శ్రేణుల‌కు సూచించారు. మీలాంటి వారితోనే స‌మాజానికి పెను ప్రమాద‌మంటూ సంజ‌య్ ఘాటు వ్యాఖ్య చేశారు. ఇంటి యజమానిని కరిచే కాపలా కుక్కలు, కంటికి అంజనం రుద్దుకొని తిరిగే క్షుద్ర మంత్రగాళ్లు, డ్రగ్స్ సేవించే బ్లాక్ మెయిల‌ర్లు, మత్తెక్కి తైతక్కలాడే లిక్కర్ సీసాలు అంటూ సంజ‌య్ ఓ రేంజిలో సాగిపోయారు.

కాపలా కుక్కలా ఉండమని పదవిస్తే కచరా కుక్కలు పిచ్చెక్కి కరవడానికి ఊరి మీద పడ్డాయ‌న్న సంజ‌య్‌, తన్ని తరిమేయకుంటే రాష్ట్రానికి, దేశానికే ప్రమాదమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పోయి వెటర్నరీ డాక్టర్‌కు చూపించుకోండి అంటూ టీఆర్ఎస్ శ్రేణుల‌ను పింకీలుగా అభివ‌ర్ణిస్తూ ట్వీట్ చేసారు.

Exit mobile version