Hyderabad: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సల్ గత ఆగస్ట్ లో నియామకమైనారు. ఈ నేపధ్యంలో ఆయన అక్టోబర్ 1న హైదరాబాదుకు రానున్నారు. మునుగోడు ఉప ఎన్నికను నవంబర్ లో చేపట్టే అవకాశం ఉన్నందున పలువురు భాజాపా నేతలతో ఆయన సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటి ఛైర్మన్ వివేక్ తో పాటు ముఖ్య నేతలతో సునీల్ బన్సల్ భేటీ కానున్నారు.
శివారులోని పెద్ద అంబర్ పేటలో నేతల భేటీ జరగనుంది. మునుగోడు నియోజకవర్గంలోని మండల ఇన్ చార్జ్ లు, సమన్వయ కమిటీలతో బన్సల్ సమావేశం కానున్నారు. ఉప ఎన్నికల్లో వ్యూహ, ప్రతివ్యూహాల పై వారితో ఆయన చర్చించనున్నారు. తెలంగాణ ఇన్ చార్జ్ గా ఉన్న తరుణ్ చుగ్ స్థానంలో ఆయన్ను నియమిస్తూ గతంలో భాజాపా పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల్లోని భాజాపా పార్టీలకు ఇన్ చార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంది