Site icon Prime9

Thammineni Seetharam: జగనే మళ్లీ సీఎం అవుతారంటూ.. తొడగొట్టిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

Ap speaker Thammineni Seetharam comments about cm jagan

Ap speaker Thammineni Seetharam comments about cm jagan

Thammineni Seetharam: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎప్పుడూ కూల్ గా ఉంటూ పెద్దగా వివాదాలకు పోకుండా కనిపిస్తుండడం చూశాం. కానీ ఇవాళ తనలోని మరో రూపాన్ని ప్రజలకు చూపించారు. శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలొ నిర్వహించిన వాలంటీర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం ఆవేశంతో ఊగిపోయారు. తొడ కొట్టి చెబుతున్నా మళ్లీ జగన్ మోహాన్ రెడ్డి సీఎం అవుతారంటూ పేర్కొన్నారు.

సీఎం జగన్ కు మహిళలే భరోసా ఇస్తున్నారన్నారు‌. అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లొకి దూసుకెళ్తున్న సీఎం జగన్ పై ప్రజల్లో విశ్వాసం రెట్టింపయ్యిందని ఆయన పేర్కొన్నారు. పింఛన్ దారులు, మహిళలు గడపగడపకు మేము వెళ్తుంటే ఘనస్వాగతం చెబుతున్నరన్నారు. తమ్మినేని తొడగొట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

Thammineni Seetharam : తొడకొట్టి చెప్తున్న ఈ సారి కూడా సీఎం జగనే | Prime9 News

ఏపీలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అమలవుతున్నాయన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పథకాల గురించే ప్రజలు మాట్లాడుతున్నారని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ మోహన్ రెడ్డే అంటూ ధీమా వ్యక్తం చేశారు. పథకాల గురించి విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే పలుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామని జగన్ చెప్పారు.. కాగా ఇప్పుడు స్పీకర్ తమ్మినేని కూడా అదే విషయం నొక్కిచెప్పుతన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జనం మళ్లీ జగన్ కే పట్టం కడతారంటూ ఆయన స్పష్టం చేశారు. పనిలో పనిగా విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. అయితే, స్పీకర్ అయి ఉండి తమ్మినేని ఇలా ప్రవర్తించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరి ఈ విషయం ఎంతటి వివాదానికి దారితీస్తుందో వేచి చూడాలి.

 

Exit mobile version
Skip to toolbar