Site icon Prime9

Mission 2024: మిషన్ 2024.. ఓడిపోయిన 144 సీట్ల పై ప్రత్యేక దృష్టి.. పార్టీ నేతలతో అమిత్ షా

Mission-2024-bjp

New Delhi: 2019లో ఓడిపోయిన 144 “కష్టమైన” లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ గెలవాలని బీజేపీ అగ్రనేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డా మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక పార్టీ నాయకులతో సమావేశమయి ఈ మేరకు మేధోమథనం సెషన్‌లో సందేశాన్ని అందించారు. కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ సీట్లను గెలుచుకునే బాధ్యతను అప్పగించాలని భావించారు..

ఒక్కో మంత్రికి మూడు నుంచి నాలుగు సీట్ల చొప్పున ఇచ్చారు. కొందరు మంత్రులు తమకు కేటాయించిన అన్ని నియోజకవర్గాలను సందర్శించలేదని అమిత్ షా పేర్కొన్నారని వర్గాలు తెలిపాయి. పార్టీ పనిని విస్మరించకూడదని స్షష్టమయిన సందేశాన్ని ఇచ్చినట్లు తెలిసింది. బూత్ స్థాయి వరకు పార్టీ కార్యకర్తలతో టచ్‌లో ఉండాలని నాయకులను కూడా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తన బూత్ స్థాయి ఉనికిని పెంచుకోవడానికి మరియు వివిధ వర్గాలకు చేరువయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో భూపేందర్ యాదవ్, గిరిరాజ్ సింగ్, స్మృతి ఇరానీ, పర్షోత్తమ్ రూపాలా, గజేంద్ర సింగ్ షెకావత్ సహా 25 మందికి పైగా కేంద్ర మంత్రులు ఉన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది.గత ఎన్నికలకు ముందు ఇదే తరహాలో కష్టతరమైన సీట్లను గుర్తించి వాటిలో అనేకం గెలుచుకోవడంలో విజయం సాధించింది. పార్టీ 144 స్థానాలను క్లస్టర్లుగా విభజించి ఒక కేంద్ర మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఈ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించడం ద్వారా రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి మరొక మంత్రుల బృందాన్ని పంపారు.

Exit mobile version