Site icon Prime9

Bandi Sanjay: బండి సంజయ్ 4వ విడత పాదయాత్ర షెడ్యూల్ ఖరారు

Bandi Sanjays 4th Prajasangrama Yatra

Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత షెడ్యూల్ ఖరారైంది. 10 రోజులపాటు 9 నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర 10 రోజులపాటు యాత్ర నిర్వహించనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గం నుంచి అబ్దుల్లాపూర్ మెట్ ఒఆర్ఆర్ సమీపంలో ముగించనున్నారు. ఈ నెల 12 నుంచి 22 వరకు పాదయాత్ర సాగనుంది.

కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగనుంది. ఈ నెల 17 కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 17వ తారీఖున పాదయాత్రకు విరామం ప్రకటించారు.

Exit mobile version