Victory Venkatesh : దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు నిశ్చితార్థం వేడుక తాజాగా ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకు.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. కాగా వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్ద అమ్మాయికి ఇప్పటికే పెళ్లి జరగగా రీసెంట్ గానే రెండో అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఈ నిశ్చితార్థం వేడుక చాలా సైలెంట్ గా జరిగిపోయింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులు, వరుడు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ నుంచి పలువురు ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఈ ఎంగేజ్మెంట్ కి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.