Sreeleela : “శ్రీలీల”..పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకా లో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ.. తాజాగా నిర్వహించిన సైమా అవార్డ్స్ 2023 లో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ధమాకా సినిమాకి గాను ఈ భామ అవార్డు పొందడం గమనార్హం. దాంతో ఈ వేడుకలో శ్రీ లీల పిక్స్ సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.