Samantha: సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన “ఏ మాయ చేశావే” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ. ఈ క్రమంలోనే నాగ చైతన్యను వివాహం చేసుకుని.. టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత కూడా ఫుల్ బిజీగా ఉంటుంది సమంత.
సమంత(Samantha) వరుస చిత్రాలతో బిజీ..
ఇక ఇటీవల తాను మయోసైటీస్ తో బాధపడుతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈ భామ.
ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంటున్న సమంత వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ప్రస్తుతం సమంత(Samantha) గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” సినిమాలో నటిస్తుంది.
ఇటీవలే ఈ మూవీ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సామ్ ఫోటోలు వైరల్ గా మారాయి.
వెన్నెల వెలుగుల్లో తెల్లని దుస్తుల్లో సామ్ మెరిసిపోతూ అందర్నీ ఆకర్షిస్తుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/