Parineeti Chopra – Raghav Chaddha Wedding : బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా – ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం 24 సెప్టెంబర్ నాడు రాజస్ధాన్ ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా, తదితరులు పెళ్లికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్ళికి కోట్లలో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. పలు కారణాల రీత్యా ప్రియాంక చోప్రా ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.