Manchu Manoj Wedding : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదనే పుకార్లకు చెక్ పెడుతూ మోహన్ బాబు దంపతులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. మంచు మనోజ్ పెళ్లి కి అతని సోదరుడు మంచు విష్ణు దంపతులు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి డైరెక్టర్ బాబీ, సింగర్ సునీత, వెన్నెల కిషోర్, బిఎస్ రవి, తేజ సజ్జా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మొత్తానికి మంచు మనోజ్ తన కొత్త జీవితాన్ని మౌనికతో ప్రారంభించడంతో మంచు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. మంచు మనోజ్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/