DOP Senthil Kumar: సెంథిల్ కుమార్ ఈ పేరు చాలా సార్లు వినే ఉంటాం. పలు ప్రముఖ సినిమాలకు ఈయన డీఓపీగా వ్యవహరించారు. ఇక ఇటీవల తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన RRR సినిమాకు కూడా ఈయన DOPగా ఉన్నారు. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం అంతా అకాడమీ అవార్డు విన్నింగ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నాయి. ఎవరికి వారు స్పెషల్ పార్టీలంటూ గెట్ టూ గెథర్ అవుతూ సంతోషంగా గడపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆ మధ్య రామ్ చరణ్, ఆ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ పార్టీలు ఇచ్చారు. తాజాగా ఆదివారం రాత్రి RRR సక్సెస్ పార్టీ నిర్వహించారు కెమెరామెన్ సెంథిల్ కుమార్. ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, రామ్ చరణ్, మంచు మనోజ్, భూమా మౌనిక, అడివి శేష్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మంచు లక్ష్మి, శోభు యార్లగడ్డ.. తదితర సినీ ప్రముఖులు విచ్చేశారు. దానితో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.