Adah Sharma : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ “అదా శర్మ”. ఈమె ఈ సినిమా తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం సినిమాలు విజయం సాధించాయి. ఇక రీసెంట్ గా అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధ ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు. అయితే నెగటివ్ పబ్లిసిటీ ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతూ 200 కోట్లు కొల్లగొట్టింది. అలానే ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా కూడా నిలిచింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతుంది. అలానే సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ అందాల ఆరబోతతో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.