Nidhi Agarwal : అక్కినేని నాగ చైతన్య సరసన “సవ్యసాచి” సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి. ముఖ్యంగా తమిళ్‌లో ఈమెకు అదిరిపోయే క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.