MLA Nimmala Rama Naidu: ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు వందల రోజుల తరబడి పేదలకు అన్నదానం చేస్తున్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు వారు నడుంబిగిస్తే, మేము మీకు తోడంటూ దాతలు క్యూ కడుతున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటిన్ పధకాన్ని రద్దు చేసింది. దీంతో పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామా నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు నడుం బిగించారు.
తన సొంత డబ్బులతో ప్రతి నిత్యం పేదలకు అన్నదానం చేస్తూ అన్న క్యాంటిన్ ను గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న సేవకు ప్రజల కూడా అన్నదానంలో అవకాశం కల్పించాలని కోరారు. దీంతో వారి వారి కుటుంబ సభ్యుల జ్నాపకార్ధం స్వయంగా అన్నదానం చేసేందుకు ముందుకొస్తున్నారు. పట్టెడు అన్నంను పేదలకు పంచుతూ అన్నదానంలో ఉన్న మాధుర్యాన్ని చవి చూస్తున్నారు. అవకాశం కల్పించిన నిమ్మల రామా నాయుడుకు అభినందలు తెలుపుతున్నారు.
తాజాగా 673రోజు చేపట్టిన అన్నదానం విశేషాలను సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు పంచుకొన్నారు. దాతలు ఎవ్వరూ రాని సమయంలో తానే అన్నదానంకు చేయూత నిస్తూ ఓ ముద్దను పేదలకు తినిపిస్తూ ప్రజా ప్రతినిధికి ఉండాల్సిన తీరును చెప్పకనే చెప్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM Jagan: తెలుగువారికి దీపావళి శుభాకాంక్షలు..ఏపీ సీఎం జగన్