Site icon Prime9

Yediyurappa Home: యడ్యూరప్ప ఇంటి వద్ద హైటెన్షన్.. రాళ్ల దాడి

Yediyurappa Home

Yediyurappa Home

Yediyurappa Home: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటిపై దాడి జరిగింది. యడ్యూరప్ప ఇంటి వద్ద భారీ ఎత్తున జనాలు గుమిగూడి, ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. సోమవారం మధ్యాహ్నం శివమొగ్గలోని ఆయన నివాసం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం ఇంటి దగ్గర భారీ ఎత్తున జనాలు నిరసన తెలుపుతున్న సన్నివేశాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఆ నిర్ణయమే కారణమా..(Yediyurappa Home)

షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన రిజర్వేషన్లపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ నిరసనకు కారణమైంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంజారా వర్గానికి చెందిన ప్రజలు యడ్యూరప్ప ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టడం ఆ దృశ్యాల్లో కనిపించింది.

 

విద్య, ఉద్యోగాల విషయంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను కొత్తగా వర్గీకరించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. దాని ప్రకారం ఎస్పీలకు ఉన్న 17 శాతం రిజర్వేషన్లను అంతర్గత వర్గీకరణ చేస్తారు. ఏజే సదాశివ కమిషన్ నివేదిక ఆధారంగా బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల తాము నష్టపోతామని బంజారా వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ అంతర్గత వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యడ్యూరప్ప ఇంటిపై దాడికి దిగారు.

 

Exit mobile version