Wrestlers met Amit Shah:భారత అగ్రశ్రేణి రెజ్లర్ల ప్రతినిధి బృందం శనివారం హోంమంత్రి అమిత్ షాతో రాజధానిలోని ఆయన అధికారిక నివాసంలో సమావేశమైంది.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తమ నిరసన గురించి మాట్లాడేందుకు ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు.వారు హోం మంత్రితో తమ ఆందోళనను పంచుకున్నారు. సమావేశం చాలాసేపు జరిగింది. అతను ప్రతిదీ విన్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అని రెజ్లర్ల సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సాక్షి మాలిక్ భర్త సత్యవ్రత్ కడియన్ మాట్లాడుతూ హోం మంత్రి అమిత్ షాతో జరిగిన రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా ఉందని, ఎందుకంటే హోం మంత్రి నుండి వారు కోరుకున్న స్పందన రాలేదని అన్నారు.శనివారం అర్థరాత్రి వరకు సమావేశం జరిగింది. హోంమంత్రి నుంచి మేం కోరుకున్న స్పందన రాకపోవడంతో సమావేశం నుంచి బయటకు వచ్చేశాం. మేము నిరసన యొక్క భవిష్యత్తు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాము. మేము వెనక్కి తగ్గమని కడియన్ చెప్పారు. రెజ్లర్లు తమ తదుపరి కార్యాచరణను ప్లాన్ చేసుకుంటున్నారని అతను తెలిపారు.
నిరసన తెలుపుతున్న రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్‌కు వెళ్లిన కొద్దిరోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది, అయితే వారిని రైతు నాయకుడు నరేష్ తికాయత్ వారించారు. రైతుసంఘాల ప్రతినిధులతో ఖాప్ పంచాయతీ నిర్వహించిన తరువాత జూన్ 9 లోపు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని తికాయత్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమిత్ షాతో భేటీకి ముందు రెజ్లర్లు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కూడా కలిశారు. వారి ఆరోపణలపై న్యాయమైన విచారణ జరిపిస్తామని ఠాకూర్ హామీ ఇచ్చారు.జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరియు ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరిలతో త్వరలో రెజ్లర్లు తమ స్వంత మహాపంచాయత్‌ను నిర్వహించనున్నారని బజరంగ్ పునియా ఆదివారం ప్రకటించారు.