Worlds Richest Beggar: బిచ్చగాళ్లే కదా అని చులకనగా చూడకండి వారిలోనూ కోటీశ్వరులు ఉంటారు అన్న మాట వినే ఉంటాం. వినడమే కాదండోయ్ ఈ మధ్య వచ్చిన బిచ్చగాడు సినిమా ద్వారా చూశాము కూడా. పరిస్థితులు ఏమైనా కావచ్చు కొందరు బిక్షాటన చేయడాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తుంటారు. అయితే మరి ఇప్పుడు ఈ బిచ్చగాళ్ల గోల ఎందుకు అనుకుంటున్నారా.. ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడైన బిచ్చగాడు మన భారత్ లోనే ఉన్నాడంటే మీరు నమ్ముతారా. అవును నిజమేనండి మన దేశంలో దేనికైనా డిమాండ్ ఆ లెవెల్లోనూ ఉంటుంది కదా మరి. మహారాష్ట్ర థానేకి చెందిన భరత్ జైన్ అనే వ్యక్తి గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బిచ్చగాడే కాదు వ్యాపారవేత్త కూడా(Worlds Richest Beggar)
భిక్షాటననే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న భరత్ జైన్ ఆస్తుల విలువ అక్షరాల రూ.7.5 కోట్లట. అతను నెలసరి సంపాదన సామాన్యుడి నెల జీతం కన్నా ఎక్కువే అది సుమారు రూ.60,000 నుంచి రూ.80,000 దాకా ఉంటుందని సమాచారం. ఇక ముంబైలో భరత్ జైన్ కి రూ.1.4 కోట్ల విలువ చేసే రెండు ప్లాట్లు ఉన్నాయట. అంతే కాకుండా థానేలోనే రెండు షాపుల్ని కొనుగోలు చేశాడట. వాటి ద్వారా నెలకు రూ.30,000 అద్దెలు కూడా వస్తుందట. ఇవే కాకుండా ఆ బిచ్చగాడు మరికొన్ని వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టాడట. ఇలా అతను బిక్షాటన చేసి ఇంత సంపాదిస్తున్నాడా అని షాక్ అవుతున్నారు కదా..
భరత్ జైన్ చిన్నతనంలో ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక చదువుకోలేకపోయాడట. అలా చిన్నప్పటి ఎన్నో కష్టాలు పడిన అతను తనలా తన బిడ్డలు కాకూడదని పిల్లల్ని బాగా చదివించి వారికి పెళ్లిళ్లు కూడా చేసాడట. ఇక భరత్ కుటుంబంలోని ఇతర కుటుంబసభ్యులు స్టేషనరీ స్టోర్ నిర్వహిస్తున్నారని సమాచారం. భరత్ జైన్ ఎక్కువగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ లో ఎక్కువగా భిక్షాటన చేస్తూ కనిపిస్తాడట. ప్రస్తుతం పరేల్ లో ఉంటున్న భరత్ ఆస్తులు విలువ ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత రిచ్చెస్ట్ బిచ్చగాడని తెలుస్తుంది.