Site icon Prime9

Baba Ram Dev: మహిళలు ఏమీ ధరించకపోయినా అందంగా కనిపిస్తారు.. బాబా రామ్ దేవ్

baba-ramdev-apologized-to-women

baba-ramdev-apologized-to-women

Baba Ram Dev: నిత్యం తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే పతంజలి అధినేత, యోగా గురువు బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మహిళలు ఏమీ ధరించకపోయినా అందంగా కనిపిస్తారంటూ వ్యాఖ్యానించారు. పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం థానేలోని హాయ్‌ల్యాండ్ ప్రాంతంలో యోగా సైన్స్ క్యాంపు, మహిళల సమావేశం నిర్వహించారు.

మహిళలు యోగా కోసం దుస్తులను తీసుకువచ్చారు మరియు తరువాత మహిళల కోసం ఒక కన్వెన్షన్ నిర్వహించారు. ఈ సదస్సుకు మహిళలు చీరలు తీసుకొచ్చారు. మహిళలకు చీర కట్టుకోవడానికి సమయం దొరకడం లేదు. దీనిపై బాబా రామ్‌దేవ్ ఓ ప్రకటన చేస్తూ.. చీర కట్టుకోవడానికి మీకు సమయం లేకపోయినా ఇబ్బంది లేదని, ఇప్పుడు ఇంటికి వెళ్లి చీర కట్టుకోండి అని అన్నారు.

అంతేకాదు మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు, మహిళలు సల్వార్ సూట్‌లలో కూడా అందంగా కనిపిస్తారు,. నా దృష్టిలో వారు ఏమీ ధరించకపోయినా అందంగా కనిపిస్తారు అంటూ రామ్ దేవ్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

Exit mobile version