Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదం అవసరం లేదని, పార్టీ మైనారిటీ విభాగాన్ని తొలగించాలని అన్నారు.మేము హిందువులను రక్షిస్తాము మరియు మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని ఆయన అన్నారు.
ఆరు సీట్లు కోల్పోయిన బీజేపీ..(Suvendu Adhikari)
కోల్‌కతాలో లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన రాష్ట్ర బిజెపి మొదటి కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇకపై సబ్కా సాత్, సబ్కా వికాస్’ బదులుగా మనం ఇప్పుడు ‘జో హమారే సాథ్ హమ్ ఉంకే సాథ్’ అంటామని ఆయన అన్నారు. బీజేపీకి మైనారిటీ మోర్చా అవసరం లేదని అన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్లో తాను 2019లో గెలిచిన 18 స్థానాల నుంచి 12కి పడిపోయింది సుమారుగా 30 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సువేందు అధికారి కీలకంగా వ్యవహరించారని బీజేపీలోని ఒక వర్గం నేతలు మండిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ, కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి, అధికార టిఎంసి నాయకులను జైల్లో పెట్టడం ద్వారా పార్టీ ఎన్నికల్లో గెలవదని అన్నారు. ఒక టీఎంసీ నాయకుడిని అరెస్టు చేస్తే నియోజకవర్గంలో గెలుపు ఖాయమని కార్యకర్తలు భావించవచ్చు. కానీ అది సాధ్యం కాదని అని జూలై 13న మిడ్నాపూర్‌లో జరిగిన కార్మికుల సమావేశంలో మజుందార్ అన్నారు.