Site icon Prime9

Supreme Court: మద్యపాన నిషేదం పై విచారణకు సుప్రీం నొ

Will Not Entertain Inquiry On Prohibition Of Alcohol

Will Not Entertain Inquiry On Prohibition Of Alcohol

New Delhi: కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో మద్యం విధానం ఉందని, రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకొంటున్నాయని, కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని పిటిసనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

మద్యం విధానం, ప్రభుత్వ ఆదాయ మార్గంతో అనుసంధానమై ఉందని కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే, ప్రభుత్వ ఆదాయాన్ని నియంత్రిస్తారని సీజేఐ పేర్కొన్నారు. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని, సామాజిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుందన్నారు. ప్రభుత్వానికి ఒక విధానాన్ని కలిగి ఉండాలని నిర్దేశించడం లాంటిదన్నారు. ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని సీజేఐ స్పష్టం చేశారు.

విచారణలో అనేక నివేదికలను ఉదహరించడం, దీనికి కేంద్రం మరోలా స్పందించడం, ఈ రకమైన విషయాలు వినోదభరితంగా ఉంటాయని సీజేఐ వ్యాఖ్యానించారు.  జోక్యం చేసుకోవడం సబబు అనిపించడం లేదన్నారు. మీకు కావలసినది మీరు చేయవచ్చని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యమని, అందుకు నోటీసులు ఇవ్వాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అప్పుడేం జరుగుతుంది? ఇది ఎక్కడ ముగుస్తుందని న్యాయవాదిని మరో న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌ ప్రశ్నించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు ధర్మాసనం పిటిషనర్ కు అవకాశం ఇచ్చింది.

Exit mobile version