Site icon Prime9

Uttar Pradesh: దారుణం.. గాయపడిన బాలిక సహాయం కోసం కేకలు వేస్తుంటే వీడియోలు తీసారు..

GIRL

GIRL

Kannauj: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నగరంలో డాక్ బంగ్లా అతిథి గృహం వెనుక 12 ఏళ్ల బాలిక రక్తపు మడుగులో కనిపించింది. మైనర్ బాలిక సహాయం కోసం అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అక్కడ గుమికూడినవారు తీవ్రంగా గాయపడిన బాలికకు సహాయం చేయకుండా తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడంలో బిజీగా ఉన్నారు.

వీడియో క్లిప్‌లో, సహాయం కోసం అడిగే ప్రయత్నంలో అమ్మాయి చేయి చాచడం చూడవచ్చు, కానీ ఆమె విన్నపాలు వినబడలేదు. ఆమెకు సహాయం చేయడానికి బదులుగా, అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు వివిధ కోణాల్లో అమ్మాయిని వీడియోలు తీయడం కనిపించింది. ఒక్కరూ కూడా పోలీసులు వచ్చేదాకా ఆమెకు ఎలాంటి సాయం అందించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు బాధిత యువతిని ఆటోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ కున్వార్‌ అనుపమ్‌ సింగ్‌ తెలిపారు. అక్టోబరు 24వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఆమె పిగ్గీ బ్యాంకు కొనేందుకు బయటకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.

బాలికను జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ ఆమెను కాన్పూర్‌కు రెఫర్ చేశారు. బాలిక పై అత్యాచారం చేసి, ఆపై డాక్ బంగ్లా అతిథి గృహం వెనుక పడేసినట్లు ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు ఈ వాదనలను ఖండించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సింగ్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఆమె పై లైంగికదాడి జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, అలాగే ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.

Exit mobile version