Bouncers to Tomatoes: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యూపీలోని వారణాసిలో కూరగాయల వ్యాపారి కస్టమర్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చినప్పుడు వారిని దూరంగా ఉంచేందుకు బౌన్సర్లను నియమించుకున్నాడు.
టమాటాలు దోచుకోకుండా ..(Bouncers to Tomatoes)
కూరగాయల విక్రేతలు స్టాక్‌ను దొంగిలించకుండా లేదా దోచుకోకుండా రక్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో టమాటా వ్యాపారి కస్టమర్లనుంచి రక్షణకు బౌన్సర్లను పెట్టుకున్నానని చెబుతున్నాడు.టమాటా ధర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను బౌన్సర్‌లను నియమించాను. ప్రజలు హింసకు పాల్పడుతున్నారు. టమాటాలు దోచుకుంటున్నారు. మా దుకాణంలో టమాటాలు ఉన్నాయి, అందువలన ఇక్కడ బౌన్సర్లను పెట్టానని అతను చెప్పాడు., ఇద్దరు బౌన్సర్లు కూరగాయలు కొనడానికి వస్తున్న కస్టమర్‌లను దూరంగా ఉంచడానికి తమ వంతు ప్రయత్నం చేయడం కనిపించింది.
మరోవైపు మెక్‌డొనాల్డ్స్ తన బర్గర్ లనుండి టమాటాలను తొలగించింది.టమాటా ధరలు రికార్డు స్థాయిలకు పెరిగిన తర్వాత దేశంలోని అనేక ప్రాంతాలలో మెక్ డొనాల్డ్ ఈ చర్య తీసకుంది. సీజనల్ సమస్యల కారణంగా నాణ్యత తనిఖీల్లో ఉత్తీర్ణత సాధించిన టమాటాలను కొనుగోలు చేయలేకపోతున్నామని మెక్‌డొనాల్డ్ ప్రతినిధి తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా సరఫరాలు తగ్గడంతో దేశవ్యాప్తంగా గురువారం టమాటా రిటైల్ ధరలు కిలోకు రూ.162 వరకు పెరిగాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన డేటా ప్రకారం, మెట్రోలలో, రిటైల్ టమాటా ధరలు కోల్‌కతాలో అత్యధికంగా రూ.152, ఢిల్లీలో రూ.120, చెన్నైలో రూ.117 మరియు ముంబైలో రూ.108గా ఉన్నాయి.