VCs Fire on Rahul: దేశంలోని వైస్‌చాన్సలర్లు, విద్యావేత్తలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై భగ్గుమంటున్నారు. ఆయనకు బహిరంగంగా లేఖ కూడా రాశారు. దీనికంతటికి కారణం దేశంలోని వీసీ అపాయింట్ మెంట్లు కేవలం ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు కలిగిన వారికి మాత్రమే దక్కుతున్నాయని రాహుల్ ట్విట్ చేశారు. అర్హత లేకున్నా.. రాజకీయ పార్టీకి అడుగులకు మడుగులొత్తే వారికి అప్పనంగా వీసీ పదవి దక్కుతుందని రాహుల్ విమర్శించారు. రాహుల్ కామెంట్‌పై దేశంలోని వీసీలతో పాటు నిపుణులైన విద్యావంతులు సుమారు వంద మంది రాహుల్‌కు బహిరంగ లేఖ రాశారు. మీరు చేసిన ట్విట్‌ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాడు విడుదల చేసిన లేఖలో వీసీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ యూనివర్శిటీల్లో పనిచేసే విద్యావేత్తలు సంతకాలు చేశారు.
ఇక వీసీల నియామకం ప్రాసెస్ గురించి రాహుల్‌కు వివరించారు. వీసీల ఎంపిక గురించి ప్రస్తావిస్తూ.. అత్యంత కఠినంగా … అంతా పారదర్శకంగా ఉంటుంది. అత్యంత కఠినమైన నిబంధనల తర్వాత మాత్రమే నియామకాలు జరుగుతాయని వివరించారు. అనవసరంగా తప్పుడు ప్రచారం చేయకండని రాహుల్‌ను కోరారు. ఇక వీసీలతో పాటు ఉన్నత పదవులకు విద్యావంతుల ఎంపిక పూర్తిగా వారి వారి విద్యార్హతతో పాటు పరిపాలన పరమైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వీసీ లేదా ఇతర ఉన్నత పదవులకు ఎంపిక చేస్తారని లేఖలో వివరించారు. రాహుల్ లేఖలో ప్రస్తావించిన అంశాలు నిరాధారమైనవన్నారు. రాహుల్ గాంధీ వీసీ ఆఫీస్ విలువలను పలుచనచేస్తున్నారన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వీసీలను వాడుకోవడం విచారకరమని లేఖలో ప్రస్తావించారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీల వైస్ చాన్సలర్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విద్యావంతులు , రాహుల్ లేఖలో ప్రస్తావించిన అంశాలు నిరాధారమైనవని, తమ రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ కార్యాలయాలతో పాటు వైస్‌చాన్సలర్ల గౌరవాన్ని భంగం కలిగించారని, వీలైనంత త్వరగా చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వీసీలు, విద్యావంతులు కోరారు.
వీసీల బహిరంగ లేఖతో పాటు రాహుల్‌గాంధీ వీసీలపై లేవనెత్తిన అంశాల గురించి గౌతమ్ బుద్ద యూనివర్శిటీ, నోయిడా వైస్ చాన్సలర్ భగవతీ ప్రకాశ్ శర్మ మాట్లాడుతూ.. రాహుల్ లేఖ గురించి ప్రస్తావిస్తూ.. ఇది ఒట్టి మూర్ఖత్వమన్నారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్ల పదవుల అర్హత విషయానికి వస్తే… ప్రొఫెసర్లుగా కనీసం పది సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉంటేనే వారికి మాత్రమే వీసీగా అవకాశం దక్కుతుందన్నారు. దేశంలో ఉన్న మెజారిటి వీసీలు పీహెచ్‌డీ తో పాటు వివిధ రకాల డిగ్రీలు సాధించినవారు. హైలీ క్వాలిఫైడ్‌తో పాటు కొంత మంది వీసీలు తాము రాసిన పుస్తకాలకు పెటెంట్ హక్కులు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నా రాహుల్‌గాంధీ మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారిని నరేంద్రమోదీ వీసీలుగా చేశారని ఆరోపించారు. అలాగే అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. అక్కడ కూడా వీసీలను నరేంద్రమోదీ నియమించారా అని ఆయన ప్రశ్నించారు.వీసీలను నేరుగా ప్రధానమంత్రి నియమించరు. దీనికి యూజీసీ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే దేశంలోని పలు చోట్ల ప్రైవేట్ యూనివర్శిటీలున్నాయి. అక్కడ ప్రభుత్వం మాట చెల్లుబాటు కాదు. వీసీల నియామకాలపై లేనిపోని ఆరోపణలు చేయడం మూర్ఖత్వమే అవుతుందంటున్నారు వైస్ చాన్సలర్స్.