Varanasi: జ్ఞాన్‌వాపి మసీదు మరియు దాని చుట్టుపక్కల భూముల పై దాఖలయిన సివిల్ దావాల పై వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. ఈ నేపధ్యంలో వారణాసిలో నిషేధాజ్ఞలు కఠినతరం చేయబడ్డాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.
జిల్లా సరిహద్దు ప్రాంతాలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో తనిఖీలు ముమ్మరం చేసి సోషల్ మీడియా పై కూడా నిఘా ఉంచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఈ కేసును విచారిస్తోంది. జ్ఞాన్‌వాపీ కేసులో తీర్పు వెలువడడానికి ముందే వారణాసి కమిషనరేట్‌లో నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. శాంతిభద్రతలు కాపాడేందుకు అధికారులు తమ ప్రాంతాల్లోని మత పెద్దలతో సంభాషించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారణాసి కోర్టు సముదాయం వెలుపల 250 మందికి పైగా పోలీసులను మోహరించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిరంతరం ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది మరియు డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. కోర్టు ప్రాంగణం చుట్టూ బయటి వ్యక్తులు నిలబడకూడదని ఉత్తర్వులు జారీ చేసారు.
వారణాసి కోర్టు సముదాయం వెలుపల 250 మందికి పైగా పోలీసులను మోహరించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిరంతరం ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది మరియు డాగ్ స్క్వాడ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. కోర్టు ప్రాంగణం చుట్టూ బయటి వ్యక్తులు నిలబడకూడదని, సత్వర స్పందన బృందాలను కూడా నియమించారు.