Site icon Prime9

Uttarakhand: భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం

Uttarakhand-heavy-rains

Pithoragarh: భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగ‌ఢ్‌, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. నది తీరం కోతకు గురై, అంచులో ఉన్న ఒక బిల్డింగ్‌ కూలింది.

ఖోటిల గ్రామంలో 50కిపైగా ఇల్లులు నీట మునిగాయి. దీంతో ఉత్తరాఖండ్‌ పోలీస్‌, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. కాలి నది ప్రమాదకర స్థితికి చేరడం పై ప్రజలను హెచ్చరించారు. ఆ నదిపై ఉన్న అన్ని వంతెనల మీదుగా రాకపోకలు సాగించవద్దని సూచించారు. భారీ వరదలకు నది అంచున ఉన్న ఒక బిల్డింగ్‌ కూలిన వీడియోను కూడా ట్వీట్‌ చేశారు.

 

Exit mobile version