Site icon Prime9

Safe Cities In India: దేశంలోనే ఈ సిటీస్ చాలా సురక్షితమంట.. మరి అవేంటి ఎక్కడున్నాయో తెలుసా..?

safe cities in India said UP CM Yogi

safe cities in India said UP CM Yogi

Safe Cities In India: దేశంలోనే ఈ సిటీస్ చాలా సురక్షితమని గణాంకాలు పేర్కొంటున్నాయి. మరి ఆ 18 సురక్షిత నగరాలు ఎక్కడున్నోయే తెలుసా.. కాశీనాథుడు కొలువై ఉన్న క్షేత్రం ఎన్నో ప్రత్యేకలున్న రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యంత సేఫ్ అయిన నగరాలను కలిగి ఉందని వెల్లడయ్యింది.

మహిళల భద్రతకు తమ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంతో దేశంలోనే యూపీ 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల్లో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, గౌతమ్ బుద్ధనగర్‌లను మొదటి దశలో సేఫెస్ట్ సిటీస్ గా అభివృద్ధి చేయాలని, దీని కోసం అన్ని విభాగాల అధికారులు ఒకరికొకరు సమన్వయం చేసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు.

సేఫ్ సిటీ ప్రాజెక్టు(Safe Cities In India)

రెండో దశలో 57 జిల్లా కేంద్రాల మున్సిపాలిటీలు, ఆ తర్వాత మూడో దశలో 143 మున్సిపాలిటీలను సేఫ్ సిటీ ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని సీఎం యోగి కోరారు. అలాగే అలాంటి అన్ని నగరాల ఎంట్రెన్స్ దగ్గర సేఫ్ సిటీ అనే సైన్‌బోర్డ్‌ను పెట్టి ప్రత్యేక బ్రాండింగ్ కూడా చేయాలని ఆయన సూచించారు.

మహిళల భద్రతకు పెద్దపీఠ
రాష్ట్రంలోని మహిళలతో పాటు ప్రతి పౌరుడి భద్రత, అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే సేఫ్ సిటీ ప్రాజెక్ట్ లక్ష్యమని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ఆరేళ్ల కాలంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన వెల్లడించారు.

ప్రతి పౌరుడికి భద్రత
రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్నో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆధునిక కంట్రోల్ రూమ్‌లు, పింక్ పోలీస్ బూత్‌లు, ఆశాజ్యోతి కేంద్రాలు, సీసీ కెమెరాలు, మహిళా పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ కోసం హెల్ప్ డెస్క్‌లు, బస్సుల్లో ప్యానిక్ బటన్‌లు, ఇతర భద్రతా చర్యలను అమలు చేశామని ముఖ్యమంత్రి యోగి వివరించారు.

బిక్షగాళ్లకు పునరావాసం
సాంఘిక సంక్షేమ శాఖ, పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా భిక్షాటనలో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు క్రమపద్ధతిలో పునరావాసం కల్పించాలని కోరారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల డ్రైవర్ల వెరిఫికేషన్ అవసరమని వెల్లడించారు.

Exit mobile version