Prime9

Union Cabinet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ!

New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో పూర్తిస్థాయి కేబినెట్ భేటీ కానుంది. దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అలాగే ఆపరేషన్ సిందూర్ తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశంలో ఏడాది కాలంగా ప్రభుత్వ పనితీరుపై సమీక్ష చేయనున్నట్టు సమాచారం. అలాగే పలు కీలక విషయాలపై చర్చ జరిగే చాన్స్ ఉందని తెలుస్తోంది.

 

అలాగే 2014 నుంచి ఏన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో పాటు ప్రభుత్వం, పార్టీ సాధించిన విజయాలను వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే బీజేపీ కార్యక్రమాలతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగాను కార్యచరణ రూపొందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాటు వారి ధైర్య సాహసాలను ప్రపంచానికి చాటి చెప్పాలని కేంద్రం భావిస్తోంది. అలాగే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపై కూడా విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version
Skip to toolbar