Union Budget 2023-24: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
యూనియన్ బడ్జెట్ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ( Stock markets) లాభాల్లో దూసుకెళ్లాయి. ప్రస్తుతం టాప్ 30 సూచీలు లాభాలతో కొనసాగుతున్నాయి.
వ్యక్తిగత ఆదాయ పన్ను పెంపు ( income tax slabs) తో పాటు ఎలాంటి ప్రతికూల ప్రకటనలు లేకపోవడంతో బుల్ పరుగులెత్తింది.
మధ్యాహ్న 1 గంట సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా లాభపడి 60,750 పాయింట్లతో కొనసాగుతుంది.
ఇక నిఫ్టీ ఏకంగా 300 పాయింట్లు లాభపడి 17,965 పాయింట్లతో ట్రేడ్ అవుతోంది. రూపాయి మారకం విలువ రూ. 81.72 గా ఉంది.
టాప్ 30 సూచీల్లో దాదాపు అన్ని షేర్లు లాభలతో పరుగులు పెడుతున్నాయి. రిలయన్స్ ,యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్ డీఎఫ్, ఇన్ఫోసిస్, మారుతీ, విప్రో, నెస్లే, హెచ్ సీఎల్ టెక్,
టీసీఎస్, ఎల్ అండ్ టీ, గెయిల్, ఎస్ బీఐఎస్, పీఎఫ్ సీ, పవర్ గ్రిడ్, నేషనల్ అల్యూమినియం వంటి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
కాగా, బడ్జెట్ 2023 లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానానికి( income tax slabs) సంబంధించి కీలక మార్పులను తీసపుకొచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
గతంలో ఉన్న ఆదాయపు పన్ను రూ. 5 లక్షల వరకు మినహాయింపు ఉండేది. ప్రస్తుతం ఆ మినహాయింపును రూ. 7 లక్షలకు పెంచారు.
అదే విధంగా ఆదాయపు పన్ను ను 5 శ్లాబులుగా విభజించారు. గతంలో 6 శ్లాబులు ఉండగా.. ప్రస్తుతం వాటిని 5 శ్లాబులకు తగ్గించారు.
3 లక్షల వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను ఉండదు.
3-6 లక్షల ఆదాయం ఉంటే 5 శాతం పన్ను విధిస్తారు.
6-9 లక్షల ఆదాయం ఉంటే 10 శాతం పన్ను కట్టాలి.
9-12 లక్షల వరకు 15 శాతం
12-15 లక్షల మధ్య 20 శాతం పన్ను చెల్లించాలి.
నూతనంగా ప్రవేశ పెట్టిన విధానంలో రూ. 15 లక్షలు ఆదాయన దాటిన వారిపై 30 శాతం పన్ను రేటు విధించారు.
అత్యధిక ఆదాయపు పన్నుపై సర్ ఛార్జి రేటును 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు.
పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 52,500 కు పెంచారు.
2014 నుండి ఆదాయపు పన్ను(Income tax) స్లాబ్‌లు మారలేదు. ప్రాథమిక వ్యక్తిగత పన్ను(Income tax) మినహాయింపు పరిమితిని చివరిగా 2014లో సవరించారు
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/