Site icon Prime9

Union Budget 2023-24: బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన నిర్మలా సీతారామన్

nirmala

nirmala

Union Budget 2023-24: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ (Union Budget2023-24)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు. అంతకు ముందు నిర్మలా సీతా రామన్ .. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో సమావేశం అయ్యారు.

నిర్మలతో పాటు కేంద్ర మంత్రులు భగవత్ కిషన్ రావ్ కరాద్, పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం నిర్మలా సీతారామన్ కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రి మండల బడ్జెట్ ను ఆమోదిస్తారు.

అనంతరం లోక్ సభలో ప్రవేశపెడతారు.

నిర్మలమ్మకు ఐదో బడ్జెట్

కాగా యూనియన్ బడ్జెట్ 2023-24 ను కూడా పేపర్ లెస్ గా రూపొందించారు. కాగితం లేకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది మూడవ సారి.

కరోనా కారణంగ గత రెండేళ్లు డిజిటల్ ఫార్మాట్ లోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

ఆర్థిక మంత్రి గా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 5 వసారి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ .

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల జరుగనుండటంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు.

 

ఎప్పటికప్పుడు అప్ డేట్స్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత Union Budget app యాప్ లో బడ్జెట్ పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్ లో విడుదల చేస్తారు.

వాటితో పాటు బడ్జెట్ పూర్తి ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (డిజి), ఫైనాన్స్ బిల్లు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్ కు సంబంధించన డాక్యుమెంట్లను ఈ యాప్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అదేవిధంగా యాప్ లో బడ్జెట్ హైలెట్స్ పేరుతో ప్రత్యేక సెక్షన్ ను ఉంటుంది. అందులో నిర్మలా సీతారామన్ ప్రసంగం ముఖ్యమైన అంశాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టడం పూర్తి అయిన తర్వాత మొత్తం డాక్యుమెంట్లను అందులో అందుబాటులో ఉంటాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version