Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో డీఆర్‌జీ జవాన్లు, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 12:43 PM IST

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో డీఆర్‌జీ జవాన్లు, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

భేజీ ప్రాంతంలో నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది అని సుక్మా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన ఇద్దరు నక్సలైట్లను గొలపల్లి లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్‌ఓఎస్) కమాండర్‌గా పనిచేసిన మడ్కం ఎర్ర,డిప్యూటీ కమాండర్ మడ్కం భీమేగా గుర్తించాారు.

మృతిచెందిన నక్సలైట్లపై రివార్డులు..(Chhattisgarh Encounter)

ఇద్దరు నక్సలైట్ల పై వరుసగా రూ. 8 లక్షలు మరియు రూ. 3 లక్షల రివార్డులను కలిగి ఉన్నారు. సమీప ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు.ఎన్‌కౌంటర్ సైట్ నుండి భద్రతా దళాలు ఆయుధాలు, భారీ మొత్తంలో ఐఈడిలు మరియు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

.ఈ నెల ప్రారంభంలో, బస్తర్‌లోని దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ సమీపంలో మావోయిస్టులు కుచ్చా రహదారిపై శక్తివంతమైన ఐఈడిని పేల్చి, కాల్పులు జరపడంతో జిల్లా రిజర్వ్ గార్డ్స్ (DRG)కి చెందిన కనీసం 10 మంది సిబ్బంది మరియు వారి డ్రైవర్ మరణించారు.