Site icon Prime9

Toll Charges : నేటి నుంచి దేశ వ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు.. ప్రజలపై మరింత భారం

toll charges increased from today onwards in india

toll charges increased from today onwards in india

Toll Charges : కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి ( ఏప్రిల్ 1 ) నుంచి దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.49 వరకు టోల్ ఛార్జీలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్ హచ్ఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. నెలవారీ పాస్‌లపై కూడా ఈ టోల్ భారం పడింది. దీంతో నెలవారి పాస్ లు రూ.275 నుంచి రూ.330 వరకు పెంచింది. ఈ పెరిగిన ఛార్జీలు ఏడాది పాటు అమలులో ఉండనున్నాయి.

జాతీయ రహదారుల ఫీజు (డిటర్మినేషన్‌ ఆఫ్‌ రేట్స్‌ అండ్‌ కలక్షన్‌) నిబంధనలు-2008 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏటా టోల్‌ ట్యాక్సుల సవరణ చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది కూడా చార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) కొత్తగా ఈ ప్రకటన విడుదల చేసింది. దాదాపు 3.5% – 7% నుంచి 10% మేర ఫీజును పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

ఏ వాహనాలపై ఎంత మేర ఛార్జీలు పెరగనున్నాయంటే (Toll Charges)..

పెరిగిన టోల్‌ ఛార్జీల కారణంగా కార్లు, జీపులకు రూ.5 నుంచి రూ.10

బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25

భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50

పెరగనున్నట్లు తెలుస్తుంది. అలానే ప్రస్తుత ట్యాక్స్‌పై పెంపుదల సగటున 4 నుంచి 4.5 శాతం ఉంది.

అదే విధంగా సాధారణ ప్రజల రవాణా అయిన బస్సు ప్రయాణం కూడా మరింత భారం కానున్నది. జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీలను 5శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సిద్ధమయ్యాయి.

దీంతో ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్‌ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్‌ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 పెంచినట్లు సమాచారం. తెలంగాణలో ఇటీవల ప్రవేశపెట్టిన నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్‌లో రూ.20 టోల్‌ఛార్జీ వసూలు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. టోల్‌ ప్లాజా నుంచి వెళ్లే ఆర్డినరీ సర్వీసులకు కూడా రూ.4 పెంచినట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి ఇప్పటికే నిత్యవసరాలు, కరెంటు బిల్లులు, వగైరా రూపాలలో ప్రజలపై భారం పడుతూనే ఉంది. ప్రభుత్వాలు ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు ప్రయత్నించాలి కానీ మరింత దిగజార్చకూడదు అని ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

 

Exit mobile version