Cheetahs: చిరుత పునరుద్ధరణ కార్యక్రమం విజయంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నేడు 12 చీతాలను దక్షిణాఫ్రిక నుంచి తీసుకొచ్చారు. వీటని కునో నేషనల్ పార్కులో కేంద్రమంత్రి.. భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వదిలిపెట్టారు. ఇది వరకే నమీబియా నుంచి 8 చిరుతపులులను మోదీ విడుదల చేశారు. దక్షిణాఫ్రిక నుంచి వచ్చిన చీతల కోసం.. క్వారంటైన్ ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు వీటిని అబ్జర్వ్ చేయనున్నారు. ఆ తర్వాత వాటిని అడవిలోకి వదిలేస్తారు.
An #IAF C-17 aircraft carrying the second batch of 12 #Cheetahs landed at AF Station Gwalior today, after a 10 hour flight from Johannesburg, South Africa.
These Cheetahs will now be airlifted in IAF helicopters and released in the #KunoNationalPark. pic.twitter.com/Pk0YXcDtAV
— Indian Air Force (@IAF_MCC) February 18, 2023
చిరుతల పునరుద్ధరణ కొరకు ప్రత్యేక కార్యక్రమం.. (Cheetahs)
1948 నుంచి భారతదేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి. భారత్ లో వాటిని పునరుద్ధరింపజేసేందుకు.. ఇతర దేశాల నుంచి చీతాలను తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రాజెక్ట్ చీతాను కేంద్రం ప్రారంభించింది. దీనిలో భాగంగానే.. దక్షిణాఫ్రికాతో ఒప్పందం చేసుకుంది. తొలి విడతగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చారు. వీటిని ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. వీటిలో ఐదు ఆడ.. మూడు మగ చిరుతలు ఉన్నాయి.
భారత్ లో కనుమరుగైన చిరుతలు..
1948 నుంచి భారత్ లో చిరుతలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సాల్ అడవుల్లో 1948లో చివరిగా కనిపించిన చిరుత మరణించింది. ఫిబ్రవరిలో 12 చిరుతలను దిగుమతి చేసుకున్న తర్వాత.. తదుపరి ఎనిమిది నుంచి 10 ఏళ్ల వరకు ఏటా 12 చిరుతలను బదిలీ చేయాలనేది ప్రణాళిక. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన ‘ఆక్షన్ ప్లాన్ ఫర్ రీ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియా’ ప్రకారం, కొత్త చిరుత జనాభాను స్థాపించడానికి అనువైన 12-14 అడవి చిరుతలను దక్షిణాఫ్రికా, నమీబియా ఇతర ఆఫ్రికా దేశాల నుండి దిగుమతి చేసుకుంటారు.
దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా 12 చీతాలను వాయుసేనకు చెందిన సీ-17 విమానం ద్వారా తరలించారు. ఇందులో ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. గ్వాలియార్ ఎయిర్ బేస్ నుంచి వీటిని శ్యోపూర్ జిల్లాలోని కునో జాతీయ పార్కుకు తరలించారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి వీటిని విడుదల చేశారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట వీటిని క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ తర్వాత పెద్ద ఎన్‌క్లోజర్లలోకి వదిలి.. అక్కడి నుంచి అడవిలోకి వదిలేస్తారు. ప్రస్తుతం ఇక్కడ 20 చీతాలు వరకు ఉండే ఏర్పాట్లున్నాయి. భవిష్యత్తులో 40 చీతాల వరకు ఉండేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే అడవిలోని ఒక చదరపు కిలోమీటర్‌కు 37 ఆహారపు జంతువుల్ని ఉంచారు.