Site icon Prime9

Rajasthan: స్టూడెంట్ ను పెళ్లి చేసుకోవడానికి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న టీచర్

Sex change

Sex change

Bharatpur: రాజస్థాన్‌లో ఒక ఉపాధ్యాయురాలు తాను ప్రేమించిన విద్యార్దినిని వివాహం చేసుకోవడానికి లింగ మార్పు శస్త్రచికిత్స చేయించుకున్నారు. నా లింగాన్ని మార్చుకోవడానికి నేను ఎప్పుడూ శస్త్రచికిత్స చేయించుకోవాలని కోరుకునేదానినంటూ ఉపాధ్యాయురాలు ఆరవ్ కుంతల్ (కొత్తపేరు) చెప్పారు. ఆరవ్‌తో ప్రేమలో ఉన్న కల్పన “నేను ఆమెను మొదటి నుండి ప్రేమిస్తున్నాను. ఈ సర్జరీ చేయించుకోకపోయినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

గతంలో మీరా అని పిలువబడే ఆరవ్ కల్పన చదివిన ప్రభుత్వ పాఠశాలలో కబడ్డీ బోధించేవారు. 2016లో మీరా (ఆరవ్) మరియు కల్పన స్నేహితులుగా మారారు. అప్పటినుంచి వారిరువురు రెండేళ్ల పాటు ఎంతో స్నేహంగా మెలిగారు. 2018లో, మీరా (ఆరవ్) కల్పనకు పెళ్లి ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఇద్దరు మహిళలు పెళ్లిచేసుకుంటానంటే వారి బంధువులు స్వలింగ వివాహాన్ని వ్యతిరేకించారు. దానితో మీరా తన ప్రియురాలు కల్పనను వివాహం చేసుకునేందుకు లింగాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని కల్పనను పెళ్లి చేసుకున్నారు.

Exit mobile version