Site icon Prime9

Tamil Nadu Waqf Board: ఏడు గ్రామాలు,1300 సంవత్సరాల దేవాలయం తమదే అంటున్న తమిళనాడు వక్ఫ్ బోర్డు

Tamil-Nadu-Waqf-Board

Tamil Nadu: తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హిందూ జనాభా అధికంగా ఉన్న ఏడు గ్రామాలను వక్ఫ్ బోర్డు తమ సొంత గ్రామాలుగా పేర్కొంది. ఇది మాత్రమే కాదు. 1500 సంవత్సరాల పురాతన దేవాలయం పై కూడా తమదే అని చెబుతోంది. మరోవైపు, వక్ఫ్ బోర్డు వాదనలకు కౌంటర్ ఇస్తూ, గ్రామస్థులు తరతరాలుగా భూమి తమదేనని రుజువు చేస్తూ కాగితాలను చూపించారు.

ఈ భూమి తమదేనంటూ గ్రామాల్లో వక్ఫ్ బోర్డు పోస్టర్లు అంటించడం గమనార్హం.ఇది కొంతమేరకు ఆక్రమణకు గురైన వక్ఫ్ ఆస్తి అని, ఆక్రమణలను అరికట్టేందుకు మా వక్ఫ్ బోర్డు అధికారికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తెలియజేయాలని తీర్మానం చేసిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఆర్కైవ్‌లలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపిన నోటీసు ప్రకారం, ఈ గ్రామాల్లో భూమిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ముందు వక్ఫ్ బోర్డు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం.ఈ ప్రజలు తరతరాలుగా ఈ భూమిని సాగు చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు ఈ భూమికి ఎలా యజమాని అవుతుందని ఏడుగ్రామాల ప్రజలు అంటున్నారు.

రాజగోపాల్ అనే వ్యక్తి తిరుచెందురై గ్రామంలో తన వ్యవసాయ భూమిని విక్రయించాలనుకున్నాడు. అయితే అతను కలిగి ఉన్న 1.2 ఎకరాల భూమి తమిళనాడు వక్ఫ్ బోర్డ్‌కు చెందినదని అతను దానిని విక్రయించాలనుకుంటే వక్ఫ్ బోర్డు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ( ఎన్ ఒ సి ) తీసుకోవాలని తెలిపారు. తాను 1996లో గ్రామంలో కొంత భూమి కొన్నానని, అది వక్ఫ్ బోర్డు భూమి కాదని అన్నారు. తన వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, అయితే దానిని విక్రయించాలనుకున్నప్పుడు, అది వక్ఫ్ బోర్డుకు చెందినదని, దానిని విక్రయించడానికి దాని నుండి అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రార్ తనకు చెప్పారని ఆయన మీడియాతో అన్నారు. తన కూతురి పెళ్లి కోసం భూమిని అమ్మాలనుకున్నానని, అయితే డబ్బు సమకూర్చుకోలేక పెళ్లి ఆగిపోయిందని రాజగోపాల్ నొక్కి చెప్పాడు. “నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను,” అని అతను ఆవేదన వ్యక్తం చేసారు.

ఇది ఒక్కరాజగోపాల్ సమస్య మాత్రమే కాదు. ఈ ఏడు గ్రామాల్లో ఎవరైనా సరే తమ వ్యక్తిగత అవసరాలకోసం ఆస్తులను విక్రయించాలంటే వారు వక్ఫ్ బోర్డు వద్దనుంచి ఎన్ ఒ సి తెచ్చుకోవలసిందే. ప్రభుత్వం దీని పై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Exit mobile version