Site icon Prime9

PM Modi birthday: మోదీ బర్త్ డే స్పెషల్.. చెన్నైలో నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు

Modi diwali gift to youngsters 75000 offer letters

Modi diwali gift to youngsters 75000 offer letters

Chennai: భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు యూనిట్ సెప్టెంబర్ 17 (శనివారం) ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని కొత్తగా పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలు మరియు 720 కిలోల చేపలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

మేము చెన్నైలోని ప్రభుత్వ ఆర్ఎస్ఆర్ఎమ్ ఆసుపత్రిని గుర్తించాము మరియు ప్రధానమంత్రి పుట్టినరోజున పుట్టిన పిల్లలందరికీ బంగారు ఉంగరం ఇవ్వాలని నిర్ణయించాము” అని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఒక ఉంగరానికి దాదాపు 2-గ్రాముల బంగారం ఉంటుంది. ఒక్కొక్కటి దాదాపు రూ. 5,000 అవుతుంది. ఆరోజు ఆసుపత్రిలో 10 నుంచి 15 డెలివరీలు జరుగుతాయని అంచనా వేసారు. మేము 720 కిలోల చేపలను ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాము. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనపథకం చేపల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మేము దానిని పంపిణీ చేస్తున్నామని మురుగన్ అన్నారు. ఈ ఏడాది మోదీకి 72 ఏళ్లు పూర్తి అవుతున్నందున 720కిలోలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు

ప్రధాని పుట్టినరోజున కేక్ లు కట్ చేయవద్దని బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాల యూనిట్లను కోరింది. రక్తదానం, వైద్యశిబిరాలను నిర్వహించాలని సూచించింది. ప్రధాని పుట్టినరోజును తీరప్రాంత పరిశుభ్రత దినంగా కూడా గుర్తించనున్నారు.

Exit mobile version